calender_icon.png 15 November, 2024 | 10:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గర్భిణీ బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలి

19-09-2024 03:09:44 PM

సిద్దిపేట (విజయక్రాంతి): గర్భిణీ, బాలింతలు, పిల్లలు పౌష్టికాహారం తీసుకోవాలని సిద్దిపేట డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ శారద సూచించారు. గురువారం సిద్దిపేట రూరల్ మండలంలోని కొల్లూరు ఐసిడిఎస్ సెక్టార్ ఆధ్వర్యంలోని అంగన్వాడి కేంద్రాలలో నిర్వహించిన పౌష్టిక మాసోత్సవాల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. గర్భం దాల్చిన ప్రతి మహిళ సమీపంలోని అంగన్వాడి కేంద్రంలో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహారాన్ని తప్పనిసరిగా పొందాలన్నారు. మూడు నుంచి ఐదు సంవత్సరాలలో పిల్లల్ని కేంద్రానికి పంపించాలని, అంగన్వాడి కేంద్రంలోని మధ్యాహ్న భోజనం చేయాలని సూచించారు.

కూరగాయలు, పండ్లు, పప్పు క్రమం తప్పకుండా పొందాలని చెప్పారు. ఆకుకూరలు తినడం వల్ల అవసరమైన క్యాల్షియం ఐరన్ మెగ్నీషియం లభిస్తుందన్నారు. పుట్టిన గంటలోపు శిశువుకు ముర్రుపాలు తాగించాలని చెప్పారు. అంగన్వాడి కేంద్రాలలో నిర్వహించే పౌష్టిక మాసోత్సవాలలో గర్భిణీలు, బాలింతలు తప్పనిసరిగా పాల్గొని తగిన సూచనలు సలహాలు పొందాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పుల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు ఉదయ్ కుమార్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఇందిరా దేవి, ఐసిడిఎస్ సూపర్వైజర్, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు, ఆయాలు, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు.