11-04-2025 07:33:03 PM
సిడిపిఓ స్వరూపారాణి..
బెల్లంపల్లి (విజయక్రాంతి): బాలింతలు ఆరోగ్య జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలని బెల్లంపల్లి సిడిపిఓ స్వరూప రాణి సూచించారు. శుక్రవారం బెల్లంపల్లి మండలం కన్నాల పరిధిలోని కన్నాల రైతు వేదిక భవనంలో పోషణ పక్షం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సిడిపిఓ స్వరూప రాణి మాట్లాడుతూ... బాలింతలు ఆహారం విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు పాటించాలన్నారు.
ఈనెల 8 నుండి 22 వరకు పోషణ పక్షం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆరోగ్యం విషయంలో చిన్న పిల్లల తల్లులకు అవగాహన కల్పించారు. తల్లులతో చిరుధాన్యాలతో వంటలు చేయించారు. గర్భిణీ స్త్రీలకు సీమంతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ లు ప్రసన్న, విష్ణు ప్రియ, పుష్పలత, రాధిక, ప్రభావతి, ఇందిర, స్వరూప, రమాదేవి లతో పాటు అంగన్వాడి టీచర్ లు, బాలింతలు, కిషోర్ బాలికలు పాల్గొన్నారు.