calender_icon.png 4 April, 2025 | 6:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే డెలివరీ చేసుకునేలా గర్భిణీలను చైతన్యపర్చాలి

03-04-2025 11:44:05 PM

నిర్లక్ష్యం వహించే వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి

హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): గర్భిణీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే డెలివరీలు చేసుకునేలా ఆశా, ఏఎన్‌ఎం, వైద్య సిబ్బంది గర్భిణీలను చైతన్యపర్చాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.  గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ ప్రోగ్రామ్ అధికారులు, ఎస్ పి హెచ్ ఓ లు,  వైద్య అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రభుత్వం వైద్య రంగానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని ఆ దిశగా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందాలని సూచించారు. గర్భిణీల రిజిస్ట్రేషన్ లో ఆశా, ఏ ఎన్ ఎం ల  పాత్ర ప్రముఖంగా ఉండాలని విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

జిల్లాలో 68 శాతం ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రులలో అలాగే 42 శాతం ప్రసవాలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరిగాయని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో 72 శాతం వరకు పెంచేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పారు. అసంక్రమిత వ్యాధులను నివారించుటకు ప్రజల్లో అవగాహన కల్పించాలని ధూమాపానం, మద్యం సేవించుట, ఆహారపు అలవాట్లపై పూర్తి అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఎన్ సి డి ద్వారా  డయాబెటిస్, బ్లడ్ ప్రెషర్, క్యాన్సర్, హార్ట్ స్ట్రోక్,బ్రెస్ట్ కాన్సర్, లపై పెద్ద ఎత్తున ప్రజలకు అవగాహన కల్పించే దిశగా కార్యచరణ చేపట్టాలని వైద్య అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జయమాలిని, చల్లాదేవి డి డి సి ఓ డాక్టర్ సరస్వతి, మాస్ మీడియా అధికారి, రాములు, డిప్యూటీ డెమో నరసింహ, ప్రోగ్రాం ఆఫీసర్లు, ఎస్బిహెచ్వోలు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.