calender_icon.png 15 March, 2025 | 11:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

108 వాహనములో గర్భిణీ ప్రసవం

15-03-2025 07:13:32 PM

తల్లి బిడ్డ క్షేమం...

పాల్వంచ (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం జగ్గు తండాకు చెందిన గర్భిణీ స్త్రీ జ్యోతి రామవరంలోని ఏం.సి.హెచ్ శనివారం పురిటి నొప్పులు రావడంతో ఆసుపత్రిలో చేరింది. రక్త హీనత, అధిక రక్త పోటు కారణంగా వైద్యులు ఏం.సి.హెచ్ రామవరం నుండి ఎంజీఎం వరంగల్ కు మెరుగైన వైద్యం కొరకు రిఫర్ చేశారు. చుంచుపల్లి 108 సిబ్బంది. ఎం.సి.హెచ్ కు చేరుకొని జ్యోతిని 108 అంబులెన్స్ లో వరంగల్ తరలిస్తుండగా మార్గమధ్యంలో పురిటి నొప్పులు ఎక్కువ అవ్వడంతో అంబులెన్స్ లోనే సుఖ ప్రసవం జరిగింది. జ్యోతికి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని వీరిని మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రిలో చేర్పించినట్లు 108 సిబ్బంది ఈ.ఎం.టీ స్నేహ, పైలెట్ హరిశంకర్ తెలియజేశారు. కుటుంబ సభ్యులు 108 సిబ్బందిని అభినందించారు.