calender_icon.png 16 March, 2025 | 4:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆస్పత్రిలో గర్భిణి మృతి

16-03-2025 12:00:00 AM

-వైద్యుల నిర్లక్ష్యమే కారణమని భర్త ఆరోపణ  

రాజేంద్రనగర్, మార్చి 15 (విజయ క్రాంతి): ఓ నిండు గర్భిణి ఆసుపత్రిలో మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే తన భార్య మృతి చెందిందని మృతురాలి భర్త శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డి కథనం ప్రకారం.. మహేశ్వరం  మండల పరిధిలోని అమీర్పేట్ గ్రామానికి చెందిన బుషమోని ప్రమీల(34) నిండు చూలాలు. ఆమె కొన్ని రోజులుగా శంషాబాద్ మండల పరిధిలోని ముచ్చింతల్   గ్రామంలో ఉన్న జిమ్స్ ఆసుపత్రిలో చెకప్స్ చేయించుకుంటుంది. ఈ క్రమంలో ఈనెల 11న భర్త సాయి బాబు తో కలిసి ఆసుపత్రికి వచ్చింది. 13వరకు అబ్జర్వేషన్ లో ఉంచారు. మందులు రాసి ఇచ్చిన వైద్యులు 18వ తేదీ తిరిగి ఆసుపత్రికి రావాలని సూచించారు.

శుక్రవారం రాత్రి 10 గంటలకు ఇంట్లో ప్రమీల వైద్యులు ఇచ్చిన మందులు వేసుకుని పడుకుంది. కొద్దిసేపటికి చాతిలో నొప్పి వస్తుందని ఆమె భర్త సాయిబాబుకు చెప్పగా వెంటనే జిమ్స్ ఆసుప త్రికి తీసుకువచ్చాడు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో నర్సులు పరిశీలించారు. అర్ధరాత్రి సమయంలో డాక్టర్ రామారావు వచ్చి ప్రమీల చనిపోయిందని ఆమె భర్త సాయిబాబుకు తెలిపాడు. వైద్యుల నిర్లక్ష్యం తోనే తన భార్య మృతి చెందిందని ఆస్పత్రి నిర్వాహకులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మృతురాలి భర్త శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేస్తున్నారు.