calender_icon.png 1 March, 2025 | 10:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్లక్ష్యానికి నిండు గర్భిణి బలి

01-03-2025 12:21:19 AM

  1.  మొదటి కాన్పులోనే మృత్యువాత 
    1.  సరైన వైద్యం అందక హైదరాబాద్‌లో మృతి 

కోనరావుపేట, ఫిబ్రవరి 28: పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆ నిండు గర్భిణీకి పండంటి కొడుకు వారసుడుగా వస్తున్నాడని మురుస్తున్న సమయంలో వైద్యుల నిర్లక్ష్యానికి ఆ తల్లి ఆశలు అడియాశలయ్యాయి. పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీని సర్కారు దావకానకు తరలిస్తే సరైన వైద్యం అందించగా పోగా వేరే హాస్పిటలకు తరలించాలని సూచనలతో పలు హాస్పిటలకు తిరిగిన ఆ గర్భిణి పురిటి నొప్పులతోనే మృత్యువాత పడ్డ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం పల్లిమక్త గ్రామానికి చెందినచిద్రవేని వరలక్ష్మి (22) మొదటి కాన్పు సందర్భంగా తల్లిగారు ఇళ్లయిన మండలంలోని కొండాపూర్ గ్రామంలో ఉంటుంది. ఈ క్రమంలో తొమ్మిదో మాసంలో ఒక్కసారిగా వరలక్ష్మికి పురిటి నొప్పులు రావడంతో సిరిసిల్ల ఏరియా హాస్పిటల్ తరలించారు.

అక్కడినుండి కరీంనగర్ తరలించగా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. అప్పటికే వరలక్ష్మి తో పాటు కడుపులో ఉన్న బిడ్డ సైతం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. బాధిత కుటుంబాన్ని ప్రభు త్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు 

అధికారులే వైఫల్యమే 

అధికారుల నిర్లక్ష్యం తోనే నిండు గర్భిణీ మృతి చెందినదని గ్రామస్తుల ఆరోపించా రు. వైద్య సిబ్బంది సరైన సమయంలో గర్భి ణీ దవాఖానకు తరలించిక పోవడంతో నిం డు మృతి చెందిందని గ్రామస్తుల వాపోతున్నారు. ఇప్పటికే ఉన్నత అదికారులు చొరు వ చూపాలని గ్రామస్తుల కోరుతున్నారు