calender_icon.png 25 January, 2025 | 1:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లారీ ఢీకొని గర్భిణి మృతి

01-08-2024 01:30:23 AM

మనోహరాబాద్ మండలం దండుపల్లిలో ఘటన

మెదక్, జూలై 31 (విజయక్రాంతి): ఏడు మాసాలుగా కడుపులో పిండాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ, మరో రెండు నెలలు నిండితే పండంటి బిడ్డకు జన్మనిద్దామనుకున్న ఓ మహిళను విధి కాటేసింది. రోడ్డు ప్రమాదం ఆమెతో పాటు గర్భస్థ శిశువును బలితీసుకుంది. ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. సిద్దిపేట జిల్లా మీర్‌దొడ్డి మండలం మల్లుపల్లె గ్రామానికి చెందిన పనేటి రాణి (29) బుధవారం తన భర్త, మరో బాలుడితో కలిసి బైక్‌పై మనోహరాబాద్ నుంచి దండుపల్లికి బయలుదేరింది. దండుపల్లి వద్ద జాతీయ రహదారిని క్రాస్ చేస్తుండగా తూప్రాన్ వైపు నుంచి అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో వారు కిందపడిపోయారు. రాణిపై నుంచి లారీ వెళ్లడంతో గర్భస్థ శిశువు బయటపడింది. ప్రమాదంలో రాణి, శిశువు మృతిచెందారు. మనోహరాబాద్ ఎస్సై సుభాష్‌గౌడ్ సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అయితే బైక్‌పై ఉన్న వ్యక్తికి, బాలుడికి గాయాలు కాగా వారు ఎక్కడికి వెళ్లారో తెలియడం లేదని ఎస్సై తెలిపారు.