calender_icon.png 22 September, 2024 | 11:01 AM

వైద్యుల నిర్లక్ష్యంతో గర్భిణి మృతి!

22-09-2024 01:37:32 AM

బంధువుల ధర్నా

నిర్మల్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసపత్రిలో గర్భిణి రక్తస్రావ మై మృతిచెందగా, ఆమె కుటుంబ స భ్యులు, బంధువులు వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతిచెందిందని ఆందోళ న చేపట్టారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని షేక్ సాహెబ్‌పేట్‌కు చెందిన ఫారనాబేగానికి నెల లు నిండడంతో శుక్రవారం కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చే ర్చారు. ఫారానాకు వైద్యపరీక్షలు చేసి ఆమెకు రక్తం తక్కువ ఉందని వైద్యు లు నిర్ధారించారు. రాత్రి 10 గంటల సమయంలో నొప్పులు వచ్చి రక్తస్రావమై గర్భిణి మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే గర్భిణి మృతిచెందిందని ఆమె తరఫు బంధువులు ఆందో ళనకు దిగారు.

దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకున్నది. తెల్లవారుజాము వరకు అక్కడ హై డ్రామా కొనసాగింది. సమాచారం అందుకు న్న పోలీసులు భైంసా ఏఎస్పీ అవినాశ్‌కుమార్, సీఐ ప్రవీణ్‌కుమార్ అక్క డికి చేరుకున్నారు. ఆందోళనకారులను సముదాయించేందుకు యత్ని ంచినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో పోలీసులు వా రిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మరోవైపు మృ తురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆసుపత్రిపై వైద్యురాలిపై కేసు నమోదైంది.