calender_icon.png 12 November, 2024 | 10:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కవలలకు జన్మనిచ్చి అనారోగ్యంతో బాలింత మృతి...

24-08-2024 08:58:10 PM

ఆదిలాబాద్,ఆగస్టు 24(విజయక్రాంతి): కవలలకు జన్మనిచ్చి ఓ బాలింత మృతి చెందిన విషాద ఘటన అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... అందుతాండ గ్రామానికి చెందిన దీక్ష (26) అనే బాలింతను మూడవ కానుపు ప్రసవం కోసం ఆమె కుటుంబ సభ్యులు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి గురువారం తీసుకెళ్లారు. కాగా ఆసుపత్రిలో ఇద్దరు కవలలకు జన్మనిచ్చిన తర్వాత దీక్ష శుక్రవారం ఆసుపత్రిలోనే అనారోగ్యానికి గురైంది. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తుండగా శనివారం తెల్లవారుజామున మృతి చెందింది. బాలింత మృతదేహాన్ని ఆమె స్వగ్రామానికి తరలించారు. మృతురాలు దీక్షకు ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ప్రసవం అనంతరం దీక్ష మృతి చెందడంతో ఊరులో విషాదఛాయలు నెలకొంది.