calender_icon.png 30 October, 2024 | 2:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగం అడిగితే ప్రెగ్నెన్సీ టెస్ట్

18-07-2024 12:05:00 AM

బీజింగ్, జూలై 17: చైనాలో కొన్ని ప్రైవేటు కంపెనీలు ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న మహిళలకు గర్భ నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నా యి. ఈ అమానవీయ ఘటనలు ఇటీవల జింగ్సు ప్రావిన్స్‌లో వెలుగు చూశాయి. మొత్తం 16 కంపెనీలు ఫిజికల్ టెస్ట్ పేరుతో 168 మంది మహిళలకు గర్భనిర్ధారణ పరీక్షలు చేయించాయి. చైనాలో ఒకవైపు అత్యల్ప జనన రేటు నమోదవుతుంటే, మరోవైపు ప్రైవేటు కంపెనీ లు గర్భిణులు, పిల్లలను సాకే మహిళలను కొలువులోకి తీసుకోక పోవడం చర్చనీయాంశమైంది. కొ న్ని కంపెనీలైతే ఇంటర్వ్యూ సమయంలోనే మహిళల వ్యక్తిగత విషయాలు, ఫ్యామిలీ ప్లానింగ్ విషయాలపై ఆరా తీస్తూ నీచానికి పాల్ప డుతున్నాయి.

ఉద్యోగార్థులు చెప్పిన వివరాలను బట్టి వారికి ఉద్యోగం ఇవ్వాలా? వద్దా? అనేది నిర్ణయిస్తున్నాయి. తాజాగా నాన్‌టోంగ్‌లో ఒక పబ్లిక్ లిటిగేషన్ సంస్థ ఈ దారుణాలపై అక్కడి ప్రభుత్వాధికారులకు నివేదించగా, అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి.. కీలక ఆధారాలు సేకరించారు. గర్భ నిర్ధారణ పరీక్షలు చేయించిన ఒక్కో కంపెనీకి వారు 6,900 డాలర్ల వరకు ఫైన్ విధించే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది.