calender_icon.png 20 January, 2025 | 10:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెళ్లికి ముందే గర్భం

07-07-2024 02:38:02 AM

  • భర్తకు తెలియకుండా డెలివరీ చేయాలని డాక్టర్లతో ఒప్పందం
  • అనంతరం పుట్టిన పాపను విక్రయించే యత్నం
  • విషయం తెలిసి 1098కు ఫిర్యాదు చేసిన భర్త
  • నిందితుల అరెస్టు

కామారెడ్డి, జూలై 6 (విజయక్రాంతి): ఓ చిన్నారిని విక్రయించిన కేసులో ఇద్దరు వైద్యులను, వారికి సహకరించిన వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు కామారెడ్డి పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. పట్టణ పోలీస్ స్టేషన్‌లో శనివారం ఆయన వివరాలను వెల్లడించారు.  కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండ లం చిట్యాల గ్రామానికి చెందిన లావణ్యకు గత ఫిబ్రవరిలో రామారెడ్డి మండలం పోసానిపేటకు చెందిన మహేశ్‌తో వివాహం జరిగింది. అయితే, అప్పటికే ఆమె గర్భం దాల్చింది. విషయం భర్తకు తెలియకుండా ఆ గర్భాన్ని తీసివేయించేందుకు ప్రయత్నించింది. చివరకు 8 ఏప్రిల్ 2024న జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మేనేజర్‌గా పనిచేస్తున్న కిరణ్‌ను లావణ్య సంప్ర దించింది.

ఆసుపత్రి వైద్యులు, సిద్దిరాములు, ప్రవీణ్‌కుమార్ కలిసి గర్భం తీసివేయాలని పుట్టిన బిడ్డకు కూడా తనకు వద్దని చెప్పడంతో రూ.2 లక్షలకు బేరం కుదుర్చుకుంది. 11 ఏప్రిల్ 2024న లావణ్యకు నొప్పులు వచ్చేలా ఇంజెక్షన్లు ఇచ్చి నార్మల్ డెలివరీ చేశారు. పుట్టిన పాపకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో మరొక ప్రైవేట్ ఆసుపత్రిలో చిక్సిత చేయించారు. తనకు పుట్టిన బిడ్డ వద్దని లావణ్య చెప్పడంతో సిద్దిరాములు తన పరిచయస్తుడైన రాజంపేటకు చెందిన బాలకి షన్‌కు.. తనవద్ద అప్పుడే పుట్టిన ఆడపిల్ల ఉందని.. ఎవరికైనా కావాలంటే ఇస్తామని చెప్పడంతో బాలికిషన్ బంధువైన సిరిసిల్ల్లకు చెందిన దేవయ్యకు చెప్పాడు.

సిరిసిల్లా జిల్లా ఇల్లంతకుంట మండలం రేపాకకు చెందిన భూపతితో  రూ.80 వేలకు బేరం కుదుర్చుకున్నారు. అనుకున్న ప్రకారం దవాఖాన మేనేజర్ ఉదయ్‌కిరణ్‌కు డబ్బులు చెల్లించారు. అయితే పాపకు చికిత్స చేయించిన ఆసుపత్రిలో లావణ్య భర్త మహేశ్‌కు తెలిసిన వారు ఉండటంతో మీ భార్య డెలివరీ అయిందట... పాప ఆసుపత్రిలో చికిత్స పొందుతుం దని చెప్పడంతో పెళ్లున రెండు నెలలకు డెలివరీ కావడం ఏంటని ఆరా తీయగా అసలు విషయం బయటపడింది.

దీంతో 1098 నంబర్‌కు లావణ్య భర్త మహేశ్ ఫిర్యాదు చేయడంతో జిల్లా చైల్డ్ వెల్ఫేర్ అధికారిణి స్రవంతి పాప విక్రయానికి సంబంధించి కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పాపను భూపతి నుంచి తీసుకొచ్చినట్టు సీఐ పేర్కొన్నారు. వైద్యులు సిద్దిరా ములు, ప్రవీణ్‌కుమార్, సిబ్బంది ఉదయ్‌కిరణ్, వాచ్‌మెన్ బాల్‌రాజ్, పాప తల్లి లావ ణ్య, బాలకిషన్, దేవయ్య, పాపను కొనుగోలు చేసిన భూపతిని అరెస్ట్‌చేసి శనివారం కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ తెలిపారు.