calender_icon.png 25 October, 2024 | 5:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలుగు నటులకే ప్రాధాన్యమివ్వాలి

15-07-2024 12:15:02 AM

సినీ నటుడు పృథ్వీరాజ్ 

ముషీరాబాద్, జూలై 14: సినీ రంగంలో పేద కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని, తెలుగు నటీనటులకే తెలుఉ చలన చిత్ర రంగం ప్రాధాన్యమిచ్చి ప్రోత్సహించాలని తెలంగాణ మూవీ, టీవీ అండ్ డిజిటల్ ఆర్టిస్ట్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు, సినీ నటుడు పృథ్వీరాజ్ కోరారు. ఆదివారం బాగ్‌లింగంపల్లిలోని సుందర య్య విజ్ఞాన కేంద్రంలో యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. యూనియన్‌ను నమ్ముకున్న కళాకారులకు సరైన పారితోషికం అందించాలని కోరారు. పేద కళాకారులకు రేషన్‌కార్డులు, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, ఈఎస్‌ఐ సౌకర్యాలను కల్పించడంతో పాటు యూనియన్ కార్యాలయానికి శాశ్వత భవనాన్ని నిర్మించేందుకు స్థలం కేటాయించాలని కోరారు. అంతకు ముందు షోయబ్ హాల్‌లో చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సుందరయ్య విజ్ఞాన కేంద్రం చీఫ్ సీఈవో వినయ్‌కుమార్, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సీఈవో ఏవీఎస్ శేఖర్ ప్రారంభించారు. దాదాపు వంద మంది రక్తదానం చేశారు.