జలమండలి ఎండీ సుదర్శన్‌రెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): వర్షపునీటిని ఒడిసి పట్టేందుకు జలమండలి ప్రాధాన్యమిస్తుందని, దీనిలో భాగంగా ఇంకుడు గుంతల ఏర్పాటుపై ప్లంబర్స్, తాపీమేస్త్రీలకు మూడురోజుల పాటు శిక్షణ ఇస్తున్నామని జల మండలి ఎండీ సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఖైరతాబాద్‌లోని వాటర్‌బోర్డు ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆయన శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. జూబ్లీహిల్స్‌లో జలమండలి నిర్మించిన రెయిన్ వాటర్ హర్వెస్టింగ్ థీమ్ పార్క్‌ను ఆయన ప్రత్యేకంగా గుర్తుచేశారు. థీమ్ పార్కులో వాననీటిని ఒడిసి పడుతున్న పద్ధతులను వివరించారు.
శిక్షణ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారు 86396 19366 అనే నంబరును సంప్రదించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్‌బాబు, రెవెన్యూ విభాగ డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్, జీఎం రాజేందర్, ఇంకుడు గుంతల నిర్మాణ ప్రత్యేకాధికారి జాల సత్యనారాయణ, రిసోర్స్ పర్సన్ కల్పన పాల్గొన్నారు.