calender_icon.png 19 March, 2025 | 8:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వడదెబ్బకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలి

18-03-2025 12:25:08 AM

జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ 

గద్వాల, మార్చి 17 ( విజయక్రాంతి) : ప్రజలందరూ వడదెబ్బకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ సూచించారు. సోమవారం ఐడీఓసీ సమావేశ హాల్లో వడదెబ్బ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించే గోడపోస్టర్ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలందరూ వడదెబ్బకు గురికాకుండా ఉండాలంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

రోజూ తగినన్ని నీళ్లు త్రాగడం,నేరుగా ఎండ వేడిమి తాకకుండా జాగ్రత్తలు పాటించడం ముఖ్యమని చెప్పారు.మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లకూడదని,ఈ సమయంలో శారీరక శ్రమ అవసరమైన పనులను నిర్వహించకూడదని తెలిపారు. బయటకు వెళ్లే అవసరం ఉంటే తల కప్పుకునే విధంగా గుడ్డలు, టోపీలు, గుడ్డ మఫ్లర్లు వాడాలని సూచించారు.మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల మధ్య వంట చేయకూడదని,ఎందుకంటే ఈ సమయంలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉంటాయని తెలిపారు

 ప్రజావాణికి 30 దరఖాస్తులు 

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయములోని సమావేశ మందిరంలో నిర్వహించిన  ప్రజావాణి కార్యక్రమంకు 30 పిర్యాదులు అందినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మి నారాయణ, నర్సింగ రావు , ఆర్డీవో శ్రీనివాస రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సిద్దప్ప, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.