06-03-2025 12:52:23 PM
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మునుగోడు, (విజయక్రాంతి): మునుగోడు నియోజకవర్గం లోని మున్సిపాలిటీలలో ప్రజలకు వేసవికాలం దృష్ట్యా త్రాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(MLA Komatireddy Rajagopal Reddy) సంబంధిత అధికారులకు సూచించారు. గురువారం పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు ఉండాలని చండూరు,చౌటుప్పల్ మున్సిపాలిటీల లలో మౌలిక సదుపాయాల కల్పన, జరుగుతున్న అభివృద్ధి పనుల తీరుపై హైదరాబాదులో మున్సిపాలిటీల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
2035 వరకు చౌటుప్పల్ మున్సిపాలిటీ(Choutuppal Municipality) జనాభా రెండు లక్షలకు పైగా పెరుగుతుందని పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులు జరగాలన్నారు. రెండు మున్సిపాలిటీలలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఉండేలా ఇంటిగ్రేటెడ్ ఆఫీసెస్(Integrated Offices) భవనాలను నిర్మించుకోవడానికి కావలసిన స్థలాలను గుర్తించాలన్నారు. చండూర్ మున్సిపాలిటీలో(Chandur Municipality) జరుగుతున్న డ్రైనేజీ పనులు, తాగునీటి పైపులైన్ల పనుల అభివృద్ధి పై ఆరా తీశారు.అభివృద్ధి పనుల ప్రణాళికలు రూపొందించాలన్నారు.వాటికి కావలసిన నిధుల సమీకరణ నేను చూసుకుంటానని అధికారులకు తెలిపారు.ఈ సమీక్ష సమావేశంలో చౌటుప్పల్ చండూరు మున్సిపాలిటీల అధికారులు పాల్గొన్నారు.