calender_icon.png 16 January, 2025 | 12:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రెగ్సెన్సీ సమయంలో జాగ్రత్తలు పాటించాలి

01-09-2024 02:02:42 AM

సైబర్‌క్రైమ్ ఎస్పీ లావణ్య 

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 31 (విజయక్రాంతి): హైరిస్క్ ప్రెగ్నెన్సీలపై మెడికవర్ ఉమెన్, చిల్డ్రన్ ఆసుపత్రిలో శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్ర మానికి ముఖ్య అతిథిగా సైబర్  క్రైమ్ ఎస్పీ డా.లావణ్య ఎన్‌జేపీ, విశిష్ట అతిథులుగా ఆంచల్ బన్సల్, విద్యావేత్త లావణ్య వల్లూరి, అసోసియేట్ డైరెక్టర్ హెచ్‌ఆర్‌టీఏఓ డిజిటల్ సొల్యూషన్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైబర్‌క్రైమ్ ఎస్పీ లావణ్య మాట్లాడుతూ.. ప్రతీ తల్లి గర్భంలో ఉన్న శిశువు ఆరోగ్యంగా ఉండాలని, సంతోషకరమైన బిడ్డకు జన్మనివ్వాలని కోరుకుంటుందన్నారు.

అయితే గర్భదారణ సమయంలో సరైన నియమాలు పాటించకపోతే తల్లి ఆరోగ్యానికి నష్టం కలిగే అవకాశం ఉంటుందన్నారు. డాక్టర్.ఎస్వీ లక్ష్మి మాట్లాడుతూ.. మారుతున్న జీవన శైలి, లేటు వయసు పెళ్లిళ్లను తగ్గించడంతో పాటు 30 ఏళ్లలోపే సంతానం కోసం ప్రయత్నించాలన్నారు. వయస్సు ఎక్కువవుతున్న కొద్దీ సంతానోత్పత్తి అవకాశాలు తగ్గుతాయన్నారు.

మెడికవర్ ఆస్పత్రి చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మహేష్ దెగ్లూర్కర్ మాట్లాడుతూ.. మెడికవర్ ఉమన్, చైల్డ్ ఆసుపత్రి నందు స్త్రీలు, పుట్టిన పిల్లలకు నాణ్యమైన వైద్య సేవలు, అతి తక్కువ ఖర్చుతో డెలివరీ ప్యాకేజీలు అందించడం జరుగుతోందన్నారు.