calender_icon.png 5 October, 2024 | 12:52 AM

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

04-10-2024 09:12:27 PM

మందమర్రి,(విజయక్రాంతి): గ్రామాల్లోని ప్రజలు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉంటూ, ఇంటి తో పాటు చుట్టూ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పట్టణ ప్రభుత్వ వైద్యులు రమేష్ సూచించారు. శుక్రవారం పట్టణంలోని మందమర్రి(వి )గ్రామంలో పట్టణ వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందచేశారు. అనంతరం యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎండీ నయీం మాట్లాడుతూ... పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని  మందమర్రి(వి) గ్రామంలో మలేరియా, టైఫాయిడ్ వంటి విష జ్వరాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా పట్టణ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ రమేష్ దృష్టికి తీసుకువెళ్లడంతో స్పందించి ఆయన వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ప్రజలందరు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అనవసరంగా ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లకుండా, ప్రభుత్వ వైద్యాన్ని సద్వివినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మెడికల్ సిబ్బంది ఎన్ సుజాత, జి రాజేశ్వరి, ఎన్ జ్యోతి, జి పద్మ లు పాల్గొన్నారు.