సీఐఈ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మారెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 1(విజయక్రాంతి): అగ్నిప్రమాదాలు సంభ వించినపుడు జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ (సీఐఈ) డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, హైదరాబాద్ డీఐఈవో దాసరి ఒడ్డెన్న అన్నారు. శుక్రవారం అబిడ్స్‌లోని మహబూబియా గర్ల్స్ జూనియర్ కాలేజీలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లకు నిర్వహించిన అగ్నిప్రామాదాలపై అవగాహన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ..
అగ్నిప్రమాదాలు జరిగినపుడు ఎలక్ట్రిక్ స్విచ్‌లు, లిఫ్ట్‌లను ఉప యోగించొద్దని సూచించారు. మెట్ల నుంచి దిగాలని, ఫైర్ స్టేషన్ నంబర్ 101కు ఫోన్ చేయాలని సూచించారు . ఈ కార్యక్రమంలో జిల్లా ఫైర్ సేఫ్టీ అధికారి టి.వెంకన్న, గౌలిగూడ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఎన్.ప్రవీణ్ కుమార్, లీడింగ్ ఫైర్‌మన్ ఓంనమశ్శివాయ, సురేష్, అశోక్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.