19-02-2025 01:22:07 AM
* కలెక్టర్, సంబధించిన అధికారులతో సిఎస్ వీడియో కాన్ఫరెన్స్
* విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం హెల్ప్ నెంబర్ 1912
* రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి
వనపర్తి, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): వేసవికాలం సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి ఇబ్బందు లు లేకుండా ముందస్తుగా అన్ని పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్ని జిల్లాల కలెక్టర్లతో తాగునీరు, నిరంతర విద్యుత్ సహా వివిధ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వ హించారు.
ఈ సమావేశానికి వనపర్తి జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభి, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంచిత్ గంగ్వార్, అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ రాష్ర్టంలోని అన్ని జిల్లాల్లో వేసవి ని దృష్టిలో ఉంచుకొని తాగునీటి సమస్యలు రాకుండా ముందస్తుగా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆయా జిల్లాల్లో ఉన్న నీటి వనరులను వేసవికి సిద్ధం చేసుకో వాలని సూచించారు.
అదేవిధంగా, అంతరా యం లేకుండా విద్యుత్ అందించేందుకు కూడా చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు ఆమె సూచించారు. రబీ సీజన్‌ను దృష్టిలో పెట్టు కొని రైతులకు కావలసిన యూరియా అం దుబాటులో ఉందో లేదో చెక్ చేసుకోవాలని చెప్పారు. రేషన్ కార్డులకు సంబంధించి ప్రజా పాలన గ్రామసభల్లో వచ్చిన దరఖా స్తులను డేటా ఎంట్రీ పూర్తి చేయాలని చెప్పా రు. ఇక ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో రెగ్యులర్గా విజిట్ చేయాలని, విద్యార్థులకు ఆహారంలో గాని, ఇంకా ఇతర ఏవైనా సమ స్యలు ఉంటే వాటిని ఎప్పటికప్పుడు పరిష్కా రం దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు
విద్యుత్ సమస్యలపై ప్రజలకు అందుబాటులో 1912 హెల్ప్ లైన్
జిల్లాలో విద్యుత్ సరఫరాలో ఆటంకం లే కుండా నిరంతర విద్యుత్ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికా రులకు కలెక్టర్ ఆదేశించారు. విద్యుత్ సరఫ రాలో ఏమైనా సమస్యలు ఉంటే తెలియజే యాలని, విద్యుత్ సరఫరాకు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రతిరోజూ నివేదిక సమర్పిం చాలని కలెక్టర్ ఆదేశించారు.
ప్రజలు ఎవరై నా విద్యుత్ సమస్యలు ఎదుర్కొంటే 1912 హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి తమ సమస్యలు తెలుపగలరని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. రైతులకు సరిపడు యూరి యా బస్తాలు అందుబా టులో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారికి సూచించారు. ఈ సమావేశంలో జెడ్పి సీఈవో యాదయ్య, మిషన్ భగీరథ ఈ ఈ మెగా రెడ్డి, విద్యుత్ శాఖ ఎస్‌ఈ రాజశేఖర్, జిల్లా వ్యవసాయ అధికారి గోవిం దు నాయక్, నీటిపారుదల శాఖ ఎస్‌ఈ శ్రీని వాసులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.