calender_icon.png 10 January, 2025 | 10:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు

10-01-2025 12:00:00 AM

అనంతపురం వేదికగా జరగాల్సిన ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రద్దు చేస్తున్నట్టు నిర్మాణ సంస్థ పోస్ట్ పెట్టింది. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కౌంటర్‌ల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు మరణించగా 40 మందికి పైగా గాయాల పాలయ్యారు.

ఈ క్రమంలోనే ఈవెంట్‌ను మేకర్స్ రద్దు చేశారు. “తిరుపతిలో జరిగిన ఘటనకు మా చిత్రబృందమంతా ఎంతో బాధ పడింది. పవిత్ర స్థలంలో హృదయ విదారక ఘటన జరిగిన నేపథ్యంలో ప్రి రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించడం సరికాదని భావిస్తున్నాం. ‘డాకు మహారాజ్’ ప్రి రిలీజ్ ఈవెంట్‌ను రద్దు చేస్తున్నాం” అని నిర్మాణ సంస్థ పేర్కొంది.