calender_icon.png 19 April, 2025 | 11:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభించాలి

09-04-2025 01:18:39 AM

టీఎస్‌యూటీఎఫ్

వికారాబాద్, ఏప్రిల్-8; రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యారంగాన్ని బలోపేతం చేయుటకోసం బడ్జెట్లో 15% నిధులు కేటాయించాలని, ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులు ప్రారంభించాలని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వెంకటప్ప డిమాండ్ చేశారు. మంగళవారం వికారాబాద్ లో టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన జిల్లా కమిటీ  సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  జిల్లా అధ్యక్షులు సి. హెచ్ వెంకటరత్నం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం లో రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కనీసం 15% కేటాయించాలని క్రమంగా దానిని 20%కు పెంచాలని, వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రాథమిక పాఠశాలల బలోపేతం కోసం ప్రత్యేక కేంద్రీకరణ జరగాలన్నారు. 

పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభించాలని, పాఠశాలల పర్యవేక్షణ వ్యవస్థను పటిష్టం చేయాలని,  వేసవి సెలవుల్లో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాములు, విఒటిటి సంపాదక వర్గ సభ్యులు వెన్నెల సత్యం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.