కరీంనగర్ (విజయక్రాంతి): దీపావళి పండుగ వెలుగులు నింపే పండుగని మరియు ప్రపంచమంతా చాలా గొప్పగా వివిధ సాంప్రదాయాలను పాటిస్తూ మహాలక్ష్మి మాతను కొలుస్తూ పండుగను చాలా సంతోషంగా కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా వేడుకగా నిర్వహించకుంటారని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా.వి.నరేందర్ రెడ్డి అన్నారు. స్థానిక భగత్ సగర్ అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో నిర్వహించినటువంటి ముందస్తు దీపావళి వేడుకలకు ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు.
దీపావళి పండుగకు చాలా ప్రత్యేకత ఉన్నదని మరియు ఎంతో చరిత్ర గల విశిష్టమైన పండుగ అని వారు తెలిపారు. దీపావళి పండుగను పురష్కరించుకొని అందరూ కూడా లక్ష్మీమాత పూజలు ఆచరించి చాలా శుభఫలాలు పొందుతారని వారు చెప్పారు. ఈ పండుగ సమయాన అందరూ కూడా వివిధ రకాల పూజలు నిర్వహిస్తూ అష్టశ్వర్యాలతో పాటు ఆయురారోగ్యాలు సిద్ధించాలని ప్రార్థిస్తారని చెప్పారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల ప్రదర్శించినటువంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలు ముఖ్యంగా మహాలక్ష్మి రావమ్మా మా కోరికలు తీర్చవమ్మా.. నృత్యం చాలా ఆకట్టుకున్నది. వేడుకులను పురస్కరించుకొని పాఠశాలను చాలా శోభయమానంగా తీర్చిదిద్ది పండుగ వాతావరణం వెలివేరిచే విధంగా చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.