calender_icon.png 6 April, 2025 | 1:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముందస్తు అరెస్టు చేసిన పోలీసులు

03-04-2025 11:02:42 PM

బాన్సువాడ (విజయక్రాంతి): బాన్సువాడ పట్టణంలోని బిజెపి నాయకులు హైదరాబాద్ వెళుతున్నారన్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సియు) 400 ఎకరాల భూమి వేలం వెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వము ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని తిరిగి ఆ భూమిని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి అప్పగించాలని నిన్న ఏబీవీపీ ఆధ్వర్యంలో సెంట్రల్ యూనివర్సిటీ భూమిని కాపాడాలని కోరుతూ శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తూ నిరసన తెలియజేస్తున్న విద్యార్థి సంఘ నాయకులపైన ఇష్టం వచ్చినట్లు లార్డ్ ఛార్జ్ చేయడం సిగ్గుచేటని రాష్ట్ర ప్రభుత్వం 400 ఎకరాల భూమిని తిరిగి సెంట్రల్ యూనివర్సిటీ అప్పగించాలని విద్యార్థుల పైన లాఠీచార్జి చేసిన  పోలీసులపైన చర్యలు తీసుకోవాలని, యూనివర్సిటీలో ఉద్యమాలు చేస్తున్న విద్యార్థి సంఘ నాయకులకు ప్రొఫెసర్లకు వారికి మద్దతు తెలపడానికి హైదరాబాద్ వెళుతున్నారని తెలుసుకొని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ గుడుగుడ్ల శ్రీనివాస్ మాజీ అసెంబ్లీ కన్వీనర్ సాయిలు పట్టణ అధ్యక్షులు ప్రసాద్ బిజెపి సీనియర్ నాయకులు కొనాల గంగారెడ్డి కొండని గంగారం శంకర్ లను అరెస్టు చేయడం జరిగింది.