01-04-2025 04:20:35 PM
ప్రజా ఉద్యమాలను నిర్బంధాలు ద్వారా అపలేరు..
సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొంతు రాంబాబు
వైరా (విజయక్రాంతి): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాని నిరసిస్తూ సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ధర్నా నేపథ్యంలో వైరా పోలీసులు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొంతు రాంబాబు, సినీయర్ నాయకులు తోట నాగేశ్వరరావు, పట్టణ కమిటీ సభ్యులు తోట కృష్ణవేణి లను తెల్లవారుజామున ముందస్తు అరెస్టు చేశారు. వైరాలో అరెస్టు సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొంతు రాంబాబు, సిపిఎం సినీయర్ నాయకులు తోట నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు పోలీసులు అరెస్టు చేయడం సరికాదని అన్నారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ప్రపంచంలో గుర్తింపు కలిగిన యూనివర్సిటీ, యూనివర్సిటీ భూములు రాష్ట్ర ప్రభుత్వం విక్రయం నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలుగు ప్రజల అత్యంత అనందంగా జరుపుకునే ఉగాది పండుగ రోజున భూములు స్వాధీనం కోసం ప్రభుత్వం జెసిబి, డ్రొజర్లు పంపి సదును చేయడంతో విద్యార్థులు యూనివర్సిటీ భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకొన్ని విక్రయం చేయవద్దు అని ఉద్యమం చేయడంతో విద్యార్థులపైన అత్యంత క్రూరంగా దాడి చేసి అరెస్టు చేసి జైలుకు పంపారు అని, వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని కోరారు.ప్రజా ఉద్యమాలను నిర్బంధాలు ద్వారా అపలేరు అన్నారు.