05-03-2025 01:09:30 AM
పెన్ పహాడ్, మార్చి 4 : ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం తమ హక్కులపై మరో మారు శాంతియుత పద్దతి లో వినతి పత్రం అందజేయాలనీ వెళుతున్న అంగన్ వాడీలను పోలీసులు ముందస్తు అరెస్టు చేయడం హేయమైన చర్యని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు రణపంగ కృష్ణ,అంగన్వాడి టీచర్స్ యూనియన్ జిల్లా కన్వీనర్ బొలిశెట్టి భాస్కరమ్మ మండిపడ్డారు.
మంగళవారం మండల కేంద్రంలో వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అంగన్వాడి సమస్యలను పరిష్కరించాలని వారికి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలన్నారు. అంగన్ వాడీలు గత కొన్ని సంవత్సరాల చాలీసాలని వేతనంతో పనిచేస్తూ కుటుంబ పోషణకు భారంగా ఉందన్నారు.
కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు కనీస వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని అరత కలిగిన వారిని సూపర్వుజర్ గా గుర్తించాలని వేసవి సెలవులు ఇస్తూ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్స్ జానీ బేగం, ఊర్మిళ, వెంకటమ్మ, విజయ, సుజాత తదితరు లు ఉన్నారు.