calender_icon.png 21 April, 2025 | 4:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

51శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ..

21-04-2025 01:40:22 AM

  1. పెండింగ్ బిల్లులు, డీఏ ఇవ్వాలి
  2. టీఆర్‌టీఎఫ్ డిమాండ్

హైదరాబాద్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లు అందరికీ 51శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ అమలు చేయాలని తెలంగాణ రాష్ర్ట టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్‌టీఎఫ్) రాష్ర్ట అధ్యక్షుడు కటకం రమేష్, రాష్ర్ట ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి కోరారు.

ఆదివారం హైదరాబాద్‌లోని రంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ సమావేశ హాలులో మాట్లాడారు. 2023 జూలై నుంచి అమలు కావలసిన వేతన సవరణ 2025 సంవత్సరం నాటికి కూడా అమలుకు నోచుకోలేకపోవడం శోచనీయ మన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతన సవరణను చేపట్టాలని కోరారు.

దేశంలోనే 5 డీఏ లు పెండింగ్ ఉన్న రాష్ర్టం మరొకటి లేదని, న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన డీఏలు వెంటనే మంజూ రు చేయాలని కార్యవర్గం విజ్ఞప్తి చేసింది. ఈ కార్యవర్గ సమావేశంలో సంఘం నేతలు లక్కిరెడ్డి సంజీవరెడ్డి, కావలి అశోక్ కుమార్, కటకం రవికుమార్, గవిని రాంరెడ్డి, మహేందర్ రాజ్, ఎ.కిరణ్ జ్యోతి, సాయిబాబు, వివిధ జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, రాష్ర్ట కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.