ధర్మపురిలో ప్రభుత్వ విప్, ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్ పూజలు
జగిత్యాల, జనవరి 10 (విజయ క్రాంతి): ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా శుక్రవారం జగిత్యాల జిల్లా ధర్మపురిలోని సుప్రసిద్ధ శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాల యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ప్ర భుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్’సింగ్ రాజ్ ఠాకూర్, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ దంప తులు స్వామి వారి దేవాలయాన్ని సందర్శిం చి, ముక్కోటి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
అనంతరం ఉదయం 5 గంటలకు ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ వైకుంఠ ద్వారాలు తెరి చి స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ ము క్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ధర్మ పురి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంద ని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.
ఆ దేవ దేవుడి ఆశీస్సులు తెలంగాణ రాష్ర్ట ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని, రాష్ర్ట ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చే శక్తిని ఆ భగవంతుడు రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్’రెడ్డికి ఇవ్వాలని మనస్పూర్తిగా కోరు కుంటున్నట్లు వారు తెలిపారు.
కాగా ముక్కో టి ఏకాదశి ప్రత్యేక వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ అడ్లూరి, ఎంపీ వంశీ, ఎమ్మెల్యే మక్కాన్సింగ్, కలెక్టర్ సత్యప్రసాద్ ఇతర ప్రముఖులందరికీ ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేసి, ఆలయ పక్షాన లాంచనం గా స్వామి వారి చిత్రపటాలు, ప్రసాదాలు అందించి సత్కరించారు. అలాగే జిల్లా కేంద్రం జగిత్యాల వెంకటేశ్వర ఆలయంలో, జిల్లాలోని కొండగట్టు క్షేత్రం ఆంజనేయ స్వా మి దేవాలయంలో, బీర్పూర్ లక్ష్మీ నరసిం హస్వామి ఆలయంలో, కోరుట్లలోని ప్రాచీనాలయం.
శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కలు తీర్చుకున్నారు. జగిత్యాలలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్’కుమార్ హాజరు కాగా, కోరుట్ల ఉత్సవాల్లో కాంగ్రెస్ రాష్ర్ట నాయకులు జువాడి కృష్ణారావు తదితర నాయకులు పాల్గొన్నారు.