30-03-2025 05:52:08 PM
సంగారెడ్డి (విజయక్రాంతి): పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల అనుమానాస్పద మృతిపై సంతాపన తెలియజేస్తూ పీస్ ర్యాలీనీ సంగారెడ్డి పట్టణంలోనీ ఐబి నుండి చౌరస్తా మీదుగా సీఎస్ఐ చర్చ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరి సోదరులు పాటలు పాడుతూ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తూ స్వచ్ఛందంగా భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవ గురువులు పెద్దలు మాట్లాడుతూ... క్రైస్తవులు అటే శాంతికి మరో పేరు ఎవరిని ఇబ్బందికి ఎటువంటి ప్రలోభాలకు లోనవ్వకుండా క్రైస్తవులు అనుసరించే మార్గాన్ని వారు జీవిస్తున్న విధానం ఇతరులకు మాదిరికరంగా ఉంటూ క్రైస్తవత్వం అంటే మతం కాదు మండుతున్న ఎండల సైతం లెక్కచేయకుండా స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ యొక్క ర్యాలీ కార్యక్రమంలో సంగారెడ్డి నియోజకవర్గంలో ఉన్నటువంటి క్రైస్తవ సోదర సోదరీమణులు గురువులు పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.