03-03-2025 12:23:22 AM
మునుగోడు, మార్చి 2 (విజయక్రాంతి): స్వర్ణకారుల సంఘం నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడిగా మునుగోడుకు చెందిన ముప్పా వరం ప్రవీణ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం మునుగోడు మండల కేంద్రంలో జరిగిన ఆ సంఘం బాధ్యుల సమావేశంలో ఎన్నిక నిర్వహించి అనంతరం జిల్లా అధక్షుడు యాదగిరి అతడికి నియామక పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. సంఘం బలపేతానికి తనవంతు కృషి చేస్తానని, తన ఎన్నికకు సహకరించిన రాష్ర్ట ఉపాధ్యక్షుడు కర్ణకంటి సత్యం, జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి, జిల్లా కార్యదర్శి ఇనుగుర్తి గోవర్ధనాచారితోపాటు సంఘం సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.