calender_icon.png 16 October, 2024 | 6:40 PM

మీ సేవా ఆపరేటర్ల సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ప్రవీణ్

16-10-2024 04:39:53 PM

కోదాడ (విజయక్రాంతి): మీ సేవా ఆపరేటర్లు సంక్షేమ సంఘం రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శిగా కోదాడ పట్టణానికి చెందిన ప్రవీణ్ మీ సేవ నిర్వాహకుడు కొదుమూరి ప్రవీణ్ ఎన్నికయ్యారు. బుధవారం హైదారాబాద్ లో జరిగిన సంఘం రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయనను ఎన్నుకున్నారు. ప్రవీణ్ గత 12 సంవత్సరాలుగా కోదాడలో మీసేవ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ.. మీ సేవ ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. మీసేవ ఆపరేటర్లు సంఘం రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శిగా ప్రవీణ్ ఎన్నిక కావడం పట్ల సూర్యాపేట జిల్లాకు చెందిన పలువురు మీ సేవ ఆపరేటర్లు తమ హర్షం వ్యక్తం చేశారు. ప్రవీణ్ కు అభినందనలు తెలిపారు.