calender_icon.png 13 November, 2024 | 7:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపెందుకే ప్రతిమ స్టడీ సర్కిల్ ఏర్పాటు

10-11-2024 01:48:10 PM

స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన నలుగురికి సన్మానం

కరీంనగర్ (విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధమవ్వడానికి ప్రతిమ స్థడీ సర్కిల్ ను ఏర్పాటు చేయడం జరిగిందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ప్రతిమ స్టడీ సర్కిల్ లో చదివి ఇటీవల విడుదలైన డీఎస్సి ఫలితాల్లో స్కూల్ అసిస్టెంట్, పీఈటీ  ఉద్యోగాలు సాధించిన వెంకటేష్, అప్రోజ్ లకు బోయినపల్లి వినోద్ కుమార్ గారు శాలువాతో తన కార్యాలయంలో సత్కరించారు. అనంతరం స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు బోయినపల్లి వినోద్ కుమార్ గారిని సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిమ స్థడీ సర్కిల్ లో ప్రశాంతమైన వాతావరణంలో అన్ని వసతులతో పాటు ఉచితంగా పోటీ పరీక్షలకు కావాల్సిన పుస్తకాలను అందుబాటులో పెట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతిమ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసిన ఏడు ఏళ్లలో ఇప్పటివరకు 410 మంది విద్యార్థులకు ఉద్యోగాలు రావడం జరిగిందని పోటీ పరీక్షలకు సిద్దమయ్యే ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జక్కుల నాగరాజు యాదవ్, అశోక్, సాయి, ప్రశాంత్, సాగర్, అక్షయ్, రమేష్, రాజు, శ్రీకాంత్, విజయ్, జీవన్ తదితరులు పాల్గొన్నారు.