calender_icon.png 11 January, 2025 | 4:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కెప్టెన్లుగా ప్రతీక్, ప్రియాంక

10-01-2025 12:00:00 AM

ఖో ఖో ప్రపంచకప్

న్యూఢిల్లీ: ఈ నెల 13 నుంచి తొలిసారి జరగనున్న ఖో ఖో ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టోర్నీకి సంబంధించిన అన్ని ఏర్పాట్లను భారత ఖోఖో ఫెడరేషన్ సమాఖ్య పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో భారత పురుషుల జట్టు కెప్టెన్‌గా ప్రతీక్ వైఖర్.. మహిళా జట్టు కు ప్రియాంక ఇంగ్లే నాయకత్వం వహించనుంది.

జనవరి 13 నుంచి 19 వరకు జరగనున్న టోర్నీలో పురుషుల జట్టు తమ తొలి మ్యాచ్‌ను నేపాల్‌తో, మహిళల జట్టు దక్షిణ కొరియాతో ఆడనున్నాయి. సుమిత్ భాటియా మహిళల జట్టుకు కోచ్‌గా వ్యవహరించనుండగా.. పురుషుల జట్టుకు అశ్వనీ కుమార్ మెంటార్‌గా పనిచేయనున్నాడు.