పాట్నా, జనవరి 7: బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని, రాష్ట్రప్రభుత్వం వెంటనే పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌కిశోర్ సోమవారం పాట్నాలో ఆమరణ దీక్ష చేపట్టగా, పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసిన సంగతి విదితమే.
అప్పటికే ప్రశాంత్ కిశోర్ ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు ఆయన్ను పాట్నాలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అంతకుముందు ఆయన్ను కోర్టులో హాజరు పరచగా, కోర్టు ఆయనకు షరతులతో కూ డిన బెయిల్ మంజూరు చేసింది.
అయితే.. కోర్టు విధించిన షరతులు తనకు నచ్చలేదని ప్రశాంత్‌కిశోర్ బెయిల్ తీసుకునేందుకు నిరాకరించారు.. దీంతో కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. తర్వాత పోలీసులు ఆయన్ను బ్యూరో సెంట్రల్ జైలుకు తరలించారు. కొన్ని గంటల తర్వాత కోర్టు తిరిగి షరతులు లేని బెయిల్ మంజూరు చేయడంతో ప్రశాంత్ కిశోర్ జైలు నుంచి విడుదలయ్యారు.