calender_icon.png 10 January, 2025 | 1:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశాంత్ కిశోర్‌కు బెయిల్.. రిమాండ్

07-01-2025 12:25:43 AM

పట్నా, జనవరి 6: బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్సీ) నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల్లో గోల్‌మాల్ జరిగిందని, రాష్ట్రప్రభుత్వం వెంటనే పరీక్షలను రద్దు చేయాలనే డిమాండ్ తో జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్‌కిశోర్ సోమవారం ఉదయం పా ట్నాలోని గాంధీ మైదానంలో చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చే శారు.

అనంతరం ఆయనపై ఎఫ్‌ఐఆర్ న మోదు చేసి పట్నాలోని సివిల్ కో ర్టు ఎదుట హాజరుపరిచారు. ప్రశాంత్ కిశోర్ తరఫు న్యాయవాది  ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరగా.. కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మం జూరు చేసింది. షరతులు సమ్మతంగా లేవని ప్రశాంత్ అభిప్రా యం వ్యక్తం చేశారు. దీంతో కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. పోలీసులు జైలుకు తరలించగా, ప్రశాంత్ కిశోర్ జైలులోనూ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు.