బీహార్ ఉప ఎన్నికల్లో జన్ సురాజ్ దారుణ ఓటమి
పాట్నా, నవంబర్ 24: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బిహార్ ఉప ఎన్నికల్లో ఆయన జన్ సురాజ్ పార్టీ తరఫున పోటీ చేసిన నలుగురు అభ్యర్థులూ ఓడిపోయారు. రెండేళ్లుగా క్షేత్రస్థాయిలో పని చేస్తూ బిహార్ వ్యాప్తంగా పాదయాత్ర చేసినప్పటికీ పోటీ చేసిన నాలుగు స్థానాల్లో ప్రశాంత్ కిషోర్ పార్ట్టీ ఓడిపోయింది.
కనీసం ఆ పార్టీ అభ్యర్థులు ఉప ఎన్నికల్లో కొంచెం కూడా ప్రభావం చూపలేకపోయారు. పోటీ చేసిన నాలుగు స్థానాల్లో మూడింట మూడోస్థానానికే పరిమితం కాగా మరో స్థానంలో దారుణంగా నాలుగో స్థానంలో నిలిచారు. తరారీ, బేళాగంజ్, ఇమామ్‌గంజ్, రామ్‌గఢ్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా.. మొదటి మూడు ప్రాంతాల్లో జన్ సురాజ్ పార్టీ నేతలు మూడో స్థానానికే పరిమితం అయ్యారు. రామ్‌గఢ్‌లో ఆ పార్టీ అభ్యర్థి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నారు.