26-02-2025 02:03:58 AM
కామారెడ్డి, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ ప్రసన్న హరికృష్ణ గూర్చి విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు కొత్మీర్కర్ వినయ్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలో ముమ్మరంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు వినయ్ కుమార్ మాట్లాడుతూ ప్రసన్న హరికృష్ణ గెలుపు దాదాపు ఖాయమైనట్టే అన్నారు.
పట్టభద్రులు, మేధావులు, విద్యావంతులు ప్రసన్న హరికృష్ణ తరుపున ఉండడం సంతోషకరమన్నారు. పట్టబద్రుల, నిరుద్యోగులు ఆశాజ్యోతి ప్రసన్న హరికృష్ణను ఈనెల 27న జరిగే ఎన్నికలలో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతూ, ఈ ఎన్నికతో కార్పొరేట్ శక్తులకు పట్టబద్రులు తగిన గుణపాఠం చెప్పబోతున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సేన నాయకులు ఆకాష్, కృష్ణ, సతీష్, రాహుల్ పాల్గొన్నారు.