సిడ్నీ: ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ఏస్ షట్లర్లు శుభారంభం చేశారు. టాప్ ప్లేయర్ హెచ్ ఎస్ ప్రణయ్ సహా ఏడుగురు భారత షట్లర్లు ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ టోర్నీ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో బుధవారం ప్రణయ్ 21 23 యోగోర్ కోయెల్హో (బ్రెజిల్)ను మట్టికరిపించాడు. రెండో రౌండ్లో ప్రణయ్ ఇజ్రాయెల్ ఆటగాడు జిల్బెర్మన్తో తలపడనున్నాడు. మరో సింగిల్స్‌లో కిరణ్ జార్జ్ 21 21 గ్జియాడాంగ్ (కెనడా)ను, సమీర్ వర్మ 21 21 రికీ టాంగ్ (ఆస్ట్రేలియా)ను ఓడించి తదుపరి రౌండ్‌కు చేరుకున్నారు. మహిళల సింగిల్స్‌లో ఆకర్షి కశ్యప్ 21 21 పొలినా బుహ్రోవా (ఉక్రెయిన్)ను మట్టికరిపించి ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. మాళవిక బన్సోద్ 21 మన దేశానికే చెందిన కెయూరా మోపతిని ఓడించగా.. అనుపమ ఉపాధ్యాయ 21 23 వాంగ్ లింగ్ (మలేషియా)ను చిత్తు చేసింది. మిక్స్డ్ డబుల్స్‌లో సుమిత్‌రెడ్డి రెడ్డి జోడీ ప్రిక్వార్టర్స్‌కు చేరుకుంది.