calender_icon.png 23 February, 2025 | 9:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ప్రణవ వన్ హైదరాబాద్’ ఫేజ్ భూమిపూజ

18-02-2025 01:37:52 AM

* ఆకర్షణీయమైన డిజైన్,పర్యావరణ అనుకూలత దీని ప్రత్యేకతలు

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 17(విజయక్రాంతి): నగరంలో మరో ఆకాశహర్మ్యం రానుందని, గతంలో సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లో ఎత్తున ఆకాశహార్మ్యాన్ని నిర్మించిన ప్రణవ గ్రూప్ ఆధ్వర్యంలో ఈ నూతన భవన నిర్మిస్తున్నట్లు ఆ సంస్థ చైర్మన్ రవి కుమార్ గుప్తా తెలిపారు. ప్రణవ వన్ హైదరాబాద్ ఫేజ్- సోమాజిగూడలో భూమిపూజ, వినాయక విగ్రహ ప్రతిష్ఠాపనతో పాటు క్లబ్ హౌస్ ఓపెనింగ్ కూడా చేశారు.

ఈ సందర్భంగా ప్రణవ గ్రూప్ చైర్మన్ రవి కుమార్ గుప్తా మాట్లాడుతూ ఎకరం విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లో 95 సూపర్ లగ్జరీ నివాసాలుంటాయని తెలిపారు. ఇవి పట్టణ జీవనానికి సరికొత్త నిర్వచనంగా నిలుస్తాయన్నారు. ఈ ప్రాజెక్ట్ హరిత, పర్యావరణ అనుకూలంగా నిర్మిస్తున్నట్టు చెప్పారు. ప్రపంచ స్థాయి క్లబ్ హౌస్‌ను రూపొందించామన్నారు. ఇది అమెరికా, యూరప్ దేశాల్లోని అత్యుత్తమ జీవనశైలికి అనుగుణంగా అద్భుతమైన సౌకర్యాలతో ఉంటుందని తెలిపారు.

ప్రణవ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాంబాబు మాట్లాడుతూ తమ ప్రత్యేకమైన టవర్లు పర్యావరణ హిత నిర్మాణ వస్తువులు, ఆధునిక గ్రీన్ టెక్నాలజీతో రూపుదిద్దు  చెప్పారు. పర్యావరణ ప్రభావాన్ని తగ్గిస్తూ జీవన సౌలభ్యాన్ని, ఆధునికతను పెంచేలా ప్రతీ అంశాన్ని జాగ్రత్తగా రూపొందించామని తెలిపారు. ప్రాజెక్ట్ ద్వారా సెంట్రల్ హైదరాబాద్‌కు అవసరమైన ‘ఏ’ గ్రేడ్ కమర్షియల్ స్పేస్‌ను అందిస్తున్నామని చెప్పారు.

కాగా ప్రణవ గ్రూప్ అత్యాధునిక నివాస, వాణిజ్య స్థలాలను నిర్మించడంలో ప్రత్యేకతను కలిగిన విషయం తెలిసిందే. ఈ సంస్థ సాధారణ నివాస సముదాయాల నుంచి భారీ వాణిజ్య భవనాల వరకు నిర్మించింది. కొండాపూర్‌లోని ది బిజినెస్ పార్క్, సోమాజిగూడలో.. హైదరాబాద్‌లోని అతి ఎత్తున భవనం వన్ హైదరాబాద్ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు ప్రణవ గ్రూప్ నిర్మించింది.