calender_icon.png 12 February, 2025 | 9:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాణహిత కృష్ణ జింకల అభయారణ్యంను సందర్శించిన చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్

10-02-2025 10:27:59 PM

చెన్నూర్ (విజయక్రాంతి): చెన్నూర్ అటవీ డివిజన్ పరిధిలో ఉన్న ప్రాణహిత కృష్ణ జింకల అభయారణ్యంను తెలంగాణ రాష్ట్ర చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్, విజిలెన్స్ పిసిసిఎఫ్ ఏలూ సింగ్ మెరూ సందర్శించారు. సోమవారం జాతీయ రహదారి-63 మార్గంలో గల చెన్నూర్ రేంజ్ చింతపల్లి బీట్ పరిధిలో ఏర్పాటు చేస్తున్న పారిపల్లి-చింత ఫారెస్ట్ చెక్ పోస్ట్, కిష్టంపేట వై జంక్షన్ వద్ద చెక్ పోస్టులను తనిఖీ చేశారు. చెక్ పోస్ట్ ల ఏర్పాటు, వాటి నిర్వహణ, అమలు, దాని ప్రాధాన్యత, తీసుకోవాల్సిన జాగ్రత్తలు పలు అంశాలపై అధికారులకు తగు సూచనలు చేశారు. ఆయనతో పాటు కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతరాం, జిల్లా డిఎఫ్ఓ శివ ఆశిష్ సింగ్, చెన్నూర్ ఫారెస్ట్ డివిజన్ అటవీ అధికారి కే సర్వేశ్వర్, చెన్నూర్, నీల్వాయి, కోటపల్లి రేంజ్ అధికారులు కే శివ కుమార్, అప్పలకొండ, సదానందం, డిఆర్ఓలు ప్రభాకర్, లావణ్య, అటవీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.