calender_icon.png 8 January, 2025 | 2:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభ్యుదయ రైతు అవార్డు అందుకున్న ప్రకృతి సేద్య రైతుపిట్టల శ్రీశైలం

06-01-2025 04:04:28 PM

ఘట్ కేసర్ (విజయక్రాంతి): ప్రకృతి సిద్ధంగా లాభదాయకమైన ఆర్గానిక్ పంటలు పండిస్తున్న ప్రకృతి సేద్య రైతు పిట్టల శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చం నాయుడు చేతుల మీదుగా ఆదివారం అభ్యుదయ రైతు అవార్డు అందుకున్నారు. మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మున్సిపాలిటీ అంకుషాపూర్ గ్రామానికి చెందిన ప్రకృతి సేద్య రైతు పిట్టల శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్శిటీ క్యాంపస్ ఆవరణలో విజ్ఞాన్ యూనివర్శిటీ, రైతు నేస్తం ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన అభ్యుదయ రైతు పురస్కారంలో భాగంగా ఈ అవార్డును అందుకున్నారు.

వ్యవసాయం దండగ అని వలసలు పోతున్న రైతులకు ఆరోగ్యంతో పాటు ఎకరాకు నెలకు రూ.30 వేలు ఆదాయం పొందవచ్చని నిరూపించిన పిట్టల శ్రీశైలానికి ఈ అవార్డు దక్కింది. ప్రకృతి సేద్య రైతు పిట్టల శ్రీశైలంను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడుతో పాటు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవ రాయలు, విజ్ఞాన్ యూనివర్శిటీ చైర్మన్ లావు రత్తయ్య, రైతు నేస్తం చైర్మన్ పద్మశ్రీ ఎడవల్లి వెంకటేశ్వరరావు చేతుల మీదుగా అందుకున్నారు. ప్రతి రైతు ప్రజల ఆరోగ్య పరిరక్షణతో పాటు లాభదాయకమైన పంటలు పండించేలా శిక్షణ ఇచ్చి ప్రోత్సహించనున్నట్లు శ్రీశైలం తెలిపారు.