calender_icon.png 1 February, 2025 | 9:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుంభమేళాలో పుణ్యస్నానం ఫొటోపై ప్రకాశ్‌రాజ్ ఫైర్

30-01-2025 12:00:00 AM

నటుడు ప్రకాశ్‌రాజ్‌కు సంబంధించిన ఓ ఫొటో విషయంలో నెట్టింట చర్చ జరిగింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మహా కుంభమేళాలో ఆయన పుణ్యస్నానం ఆచరించినట్టు ఎవరో ఫొటో క్రియేట్ చేసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది వాస్తవం అనుకొని నమ్మిన కొందరు నెటిజన్లు ప్రకాశ్‌రాజ్‌పై విమర్శలు గుప్పించారు.

‘నాస్తికుడని చెప్పుకొనే మీరు కుంభమేళాకి వెళ్లారంటే ఏమనాలి?’ అంటూ కామెంట్లు పెట్టారు. ఈ విషయంపై ప్రకాశ్‌రాజ్ స్పందించారు. సోషల్ మీడియాలో తన గురించి వైరల్ అవుతున్న ఫోటో, వార్త.. అంతా నకిలీ అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

దీనిపై ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ‘అసలు నిజమేంటో కోర్టులో తెలుస్తుంది.. ఇలా చేయడం సిగ్గుచేటు. సంబంధిత వ్యక్తులు పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని కన్నడలో రాసుకొచ్చారు.