హైదరాబాద్: దర్శకుడు రాంగోపాల్ వర్మకు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు ఈరోజు నోటిసులు ఇచ్చారు. నగరంలోని జూబ్లీహిల్స్ లో ఉన్న ఆర్జీవి ఇంటికి వచ్చి మద్దిపాడు పోలీసులు నోటీసులు ఇచ్చారు. సోషల్ మీడియా ద్వారా చంద్రబాబు, పవన్, లోకేశ్ పై అసభ్యకరమైన పోస్టులు పెట్టారని ఆర్జీవీపై కేసు నమోదు అయింది. కాగా, మూడు రోజుల క్రితం టీడీపీ నేత రామలింగం ఫిర్యాదుతో మద్దిపాడు పీఎస్ లో ఆర్జీవీపై కేసు నమోదు అయిన సంగతి తెలిసందే.