28-02-2025 12:00:00 AM
కన్నడ హీరో ప్రజ్వల్ దేవరాజ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రాక్షస’. లోహిత్ హెచ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం టైమ్ లూప్ హారర్ కాన్సెప్ట్‌తో రూపొందింది. ఈ సినిమాలో అరుణ్ రాథోడ్, శ్రీధర్, గౌతమ్, సోమశేఖర్, విహాన్ కృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఫిబ్రవరి 28న విడుదల విడుదల కావలసిన ఈ చిత్రాన్ని కొన్ని అనివార్య కారణాలతో వారం రోజులపాటు వాయిదా వేశారు. ఈ క్రమంలోనే ఈ సినిమా మార్చి 7న విడుదల కానుంది. గతంలో శివరాజ్ కుమార్ నటించిన ‘వేద’ చిత్రాన్ని విడుదల చేసిన ఎంవీఆర్ కృష్ణ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఎంవీఆర్ కృష్ణ మాట్లాడుతూ.. “బెటర్ ఔట్ పుట్ కోసం మా చిత్రాన్ని వారం రోజుల పాటు వాయిదా వేశాం. ఈ చిత్రం ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. ఈ చిత్రానికి కూడా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కుతుందని నమ్మకం ఉంది” అని చెప్పారు.