ముంబై: భారత టెన్నిస్ ఆటగాడు ప్రజ్నేశ్ గున్నేశ్వరణ్ శుక్రవారం టెన్నిస్‌కు వీడ్కోలు పలికాడు. 2010లో ప్రొఫెషనల్ టెన్నిస్ కెరీర్‌ను ఆరంభించిన ప్రజ్నేశ్ 2018 ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించాడు. కెరీర్లో 2 ఏటీపీ చాలెంజర్ టోర్నీలు, ఐటీఎఫ్ సింగిల్స్‌లో 8 టైటిల్స్.. డబుల్స్‌లో ఒక టైటిల్ నెగ్గాడు. 25కె పురుషుల ఐటీఎప్ టోర్నమెంట్లో కరణ్ సింగ్ సెమీస్‌లో అడుగుపెట్టాడు.
శుక్రవారం పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో కరణ్ సహచర ఆటగాడు విష్ణు వర్దన్‌ను మట్టికరిపించాడు. సెమీస్‌లో కరణ్ డాలిబొర్ వెర్సినా (చెక్ రిపబ్లిక్)ను ఎదుర్కోనున్నాడు. డబుల్స్ విభాగంలో ఆర్యన్ షా-ఆదిత్య జోడీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఫైనల్లో భారత్‌కే చెందిన రెండో సీడ్ ప్రజ్వల్ దేవ్-ఆదిల్ జంటతో తలపడనుంది.