calender_icon.png 28 December, 2024 | 2:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణికి 66 ఫిర్యాదులు

28-10-2024 09:33:22 PM

సంగారెడ్డి అర్బన్,(విజయక్రాంతి): జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో కలెక్టర్‌ వల్లూరు క్రాంతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు.  జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ఫిర్యాదుదారులు వచ్చి తమ సమస్యలను కలెక్టర్ తో పాటు, అదనపు కలెక్టర్ లు, డీఆర్ఓ పద్మజ రాణి లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. ఈ కార్యక్రామంలో 66 ఫిర్యాదులు అందినట్లు కలెక్టర్ వెల్లడించారు.  కాగా, అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.