calender_icon.png 18 January, 2025 | 5:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపటి ప్రజావాణి (గ్రీవెన్స్) కార్యక్రమం రద్దు

01-09-2024 01:58:54 PM

కలెక్టర్ పమేలా సత్పతి 

కరీంనగర్,(విజయక్రాంతి): సెప్టెంబర్ రెండవ తేదీ (సోమవారం) కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని భారీ వర్షాల నేపథ్యంలో రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి నేడోక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో చెరువులు, కుంటలు, వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రజలకు, ఎలాంటి ఇబ్బందులు కలగద్దు అనే ఉద్దేశంతో పాటు జిల్లా యంత్రాంగం అంతా సహాయక చర్యలలో నిమగ్నం అయినందున  ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఇట్టి  విషయాన్ని గమనించి ప్రజలు  ఫిర్యాదులు ఇచ్చుటకు కలెక్టరేట్    కార్యాలయానికి ఎవరూ రావద్దని, వచ్చే సోమవారం ప్రజావాణి యాదవిధిగా కొనసాగుతుందని కలెక్టర్ అట్టి ప్రకటన లో వెల్లడించారు