calender_icon.png 27 December, 2024 | 10:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

02-12-2024 03:23:35 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ హాజరయ్యారు. అంతకుముందు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన సమస్యలు భూసంబంధ రుణాలు రెండు పడకల గదుల ఇల్లు మంజూరు వంటి సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన ఆర్జీలను పరిశీలించి, సత్వరమే పరిష్కరించాలని సూచించారు. అనంతరం బాల్య వివాహాల, రైతు భారత్ పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి విక్టర్ ఆర్డీవో రంగనాథరావు జెడ్పి సీఈవో చందర్ నాయక్ వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.