calender_icon.png 15 January, 2025 | 2:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలి: కలెక్టర్ బి. సత్య ప్రసాద్

09-09-2024 04:50:57 PM

జగిత్యాల, (విజయ క్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజావాణిలో వచ్చే సమస్యలకు సత్వరం పరిష్కార మార్గం చూపాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణికి ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులు 61రాగా అదనపు కలెక్టర్లు పి. రాంబాబు, గౌతమ్ రెడ్డి లతో కలసి స్వీకరించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ... సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఎన్నో వ్యయ ప్రయాసాలకోర్చి వస్తారని, అధికారులు శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులను సానుకూలంగా స్పందించి ప్రాధాన్యతక్రమంలో సమస్యల పరిష్కారం చూపించాలని అన్నారు. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కారం చూపించాలని అధికారులను ఆదేశించారు.కాగా ప్రజావాణికి 61 ఫిర్యాదులు, వినతులు వచ్చినవి వెంటనే సంబంధిత అధికారులను పరిష్కరించేలా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో  అదనపు కలెక్టర్లు పి. రాంబాబు, గౌతమ్ రెడ్డి, జగిత్యాల, మెట్ పల్లి ఆర్డీఓలు మధుసూధన్, శ్రీనివాస్, కలెక్టరేట్ ఏఓ హన్మంతరావు, వివిధ  జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ పర్యవేక్షకులు పాల్గొన్నారు.