సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి
సిద్దిపేట (విజయక్రాంతి): ఈనెల 2 న సోమవారం నాడు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లాలో కురుస్తున్న అధిక వర్షాల వలన రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి తెలిపారు. ఈ విషయాన్ని గమనించి ప్రజలు ప్రజావాణి కార్యక్రమానికి కలెక్టర్ కార్యాలయానికి సోమవారం నాడు రావద్దని ప్రకటనలో జిల్లా కలెక్టర్ తెలిపారు.
విద్యాసంస్థలకు సెలవు
భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, ఐటిఐలు, రెసిడెన్సియల్ విద్యా సంస్థలకు ఈనెల 2వ తేదీన సోమవారం నాడు సెలవును ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం. మనుచౌదరి తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఐటిఐ కళాశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు ఈ ఆదేశాలను అమలు చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.