calender_icon.png 23 February, 2025 | 7:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు

23-02-2025 01:08:58 PM

జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష

పెద్దపల్లి,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని, ఈ నెల 24వ తేదీన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు  జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష  ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.  ప్రజలు వినతులు ఇవ్వడానికి కలెక్టరేట్ కు రావద్దని విజ్ఞప్తి చేశారు. ఈనెల 27న  ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో అధికారులంతా క్షేత్రస్థాయిలో ఎన్నికల విధులలో ఉన్నందున ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.